శ్రీలలితా సహస్రనామాలు రహస్యమైనవి ఎందుకయినవో చెప్పబడిన గ్రంథము *నామపారాయణప్రీతా* ఇందులో గల నామాలు 20,736. ఇవి బీజాక్షరయుతమే గాని బీజాక్షరములు కావు, అవి *నందివిద్యా* నామములైన అమ్మవారి నామములు. ఒక్కొక్క నామములోని గల ఒక్కొక్క అక్షరము *అ* నుండి *క్ష* వరకు గల అక్షరమాలలోని అక్షరాధిదేవతల నామములేయని విపులీకరింపబడిన గ్రంథము *నామపారాయణప్రీతా* ఈ అక్షరాధి దేవతలు షట్చక్రములలోనే ఉన్నారు. వారి మధ్య అమ్మవారు విరాజిల్లుతున్నది గనుక ఆ 20,736 నామములు అమ్మవారి నామములే యనియు, అవికూడా నామపారాయణక్రమములోనే ఉన్నవని రూఢి చేసిన గ్రంథము *నామపారాయణప్రీతా* ఈ 20,736 నామములు అమ్మవారికి ఇష్టమైన నామములు గనుక ఇవి కూడా నామపారాయణ క్రమములోనే ఉన్నవని ఋజువు చేసిన గ్రంథము *నామపారాయణప్రీతా* షట్చక్రమములలోని దేవతలతో కూడిన అమ్మవారే ఈ నందివిద్యా నామాధిదేవతయని తెలియజేసిన గ్రంథము *నామపారాయణప్రీతా*





